ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మేనియానే కనిపిస్తుంది. మార్చి 25న భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం ప్రపంచ దేశాల తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఇండియాలోనే కాకుండా దుబాయ్‌లో సైతం ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రీసెంట్‌గా జరిగిన ఈవెంట్‌లో దర్శక ధీరుడు రాజమౌళి మూవీ విశేషాలను పంచుకున్నాడు.
చదవండి: కీరవాణి కంపోజ్ చేసిన ఆ పాట అంటే ఇరిటేషన్: ఎన్టీఆర్
ఆ సందర్భంగా సినిమాల మేకింగ్‌పై ఎదురైన ప్రశ్నకు జక్కన్న ఆసక్తికర రితీలో సమాధానం ఇచ్చాడు. ‘నా ఫోకస్ ఎప్పుడు పాత్రల మీదే ఉంటుంది. వారి పాపులారిటీ మీద కాదు. ఆర్‌ఆర్‌ఆర్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్‌ల పాపులారిటీని చూడను, వారిని తెరపై సమానంగా ఎలా చూపించాలనేది మత్రమే ఆలోచిస్తాను. అందుకే ఫిలిం మేకర్‌గా నేను ఫెయిల్యూర్’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘మూవీని తెరకెక్కించే సమయంలో నేను నా పాత్రల గురించే ఆలోచించాల్సి ఉంటుంది. నాకు నా సీతారామరాజు, నా కొమురం భీమ్, సీతా పాత్రలను స్క్రీన్‌పై ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మాత్రమే చూస్తాను'
చదవండి: ఈ వారం సందడి చేసే పెద్ద సినిమాలు ఇవే..
'అలాంటప్పుడే మంచి సినిమాను తెరకెక్కించగలను. అంతేగాని వారికి ఉన్న ఇమేజ్‌ని బట్టి నా సినిమాలో పాత్రలు ఉండవు’ అంటూ వివరణ ఇచ్చాడు. కానీ ప్రేక్షకులు మాత్రం హీరోల క్రేజ్‌ను బట్టి థియేటర్‌కు వస్తారని, కానీ తన కథలోని పాత్రలు ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా ఉంటాయన్నాడు జక్కన్న. కాగా ఈ మూవీలో కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలీవియా మోరిస్, చెర్రీకి జోడిగా ఆలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment