Netizen Funny Tweet On RRR Movie Release, See RRR Team Shocking Reaction - Sakshi
Sakshi News home page

RRR Movie: నెటిజన్‌ కామెంట్‌పై ఆసక్తిగా స్పందించిన మూవీ టీం

Published Fri, Nov 19 2021 2:23 PM | Last Updated on Fri, Nov 19 2021 6:02 PM

RRR Movie Team Stunning Reply To a Netizen Who Tweet On Release - Sakshi

RRR Movie Team Stunning Reply To Netizen Comment: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌( ‘రౌద్రం, రణం, రుధిరం’). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా వస్తోన్న ఈ మూవీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమై నేటికి(నవంబర్‌ 19) మూడేళ్లు అవుతోంది. సరిగ్గా (18-11-2018) రోజున రాజమౌళి, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఫొటోను షేర్‌ చేస్తూ షూటింగ్‌ మొదలైనట్లు డీవీవీ సంస్థ ప్రకటించింది.

చదవండి: మెగా డాటర్‌ శ్రీజ పోస్ట్‌పై సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ ఆసక్తికర కామెంట్‌

ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలపై విసుగు చెందిన ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా స్పందించాడు. అప్పటి ట్వీట్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘డిప్లొమాలో ఉన్నప్పుడు మీరు సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. నా బీటెక్‌ కూడా అయిపోయింది. మూవీ మాత్రం ఇంకా రిలీజ్‌ కాలేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీం స్పందిస్తూ అతడికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. అతడి ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ ‘ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము కూడా షూటింగ్‌ చేయలేదు’ అంటూ కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యమైనట్లు చెప్పకనే చెప్పింది. 

చదవండి: హాట్‌ టాపిక్‌గా శివకార్తికేయన్‌ రెమ్యునరేషన్‌, తక్కువ టైంలో అంత మొత్తమా!

డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్‌లుక్‌ అంచనాలను మరింత పెంచేశాయి.  దాదాపు షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీం వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement