'ఆర్ఆర్ఆర్' సినిమాపై సోషల్‌మీడియాలో మరో రచ్చ..! | Ram Charan Jr NTR Movie RRR News circulates on social media | Sakshi
Sakshi News home page

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాపై సోషల్‌మీడియాలో మరో రచ్చ..!

Published Mon, Mar 7 2022 12:06 AM | Last Updated on Mon, Mar 7 2022 1:09 AM

Ram Charan Jr NTR Movie RRR News circulates on social media - Sakshi

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభమై రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే సినిమా విడుదలకు ఇంకా 17 రోజుల సమయం ఉండగా సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమా క్లైమాక్స్‌లో తారక్‌ని చరణ్ డామినేట్ చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక సాధారణంగా తారక్ నటన గురించి తెలియని వారుండరు. తన నటనకి ఎవరూ వంకలు పెట్టలేరు.

ఓ సాధారణ సినిమాను సైతం తన టాలెంట్‌తో మరో స్థాయికి తీసుకెళ్లగల నటుడు తారక్‌ అని చెప్పొచ్చు. అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్‌లలో ఎవరి పాత్ర డామినేటెడ్‌గా ఉన్నా అభిమానులు సంతృప్తి చెందరు. అయితే రాజమౌళి మాత్రం అలాంటి పొరపాట్లు చేయరని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి గాసిప్స్ మరెన్నో 'ఆర్ఆర్ఆర్' చిత్రం రిలీజయ్యే వరకు ప్రచారంలోకి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి.

అయితే రాజమౌళి తన ప్రతి సినిమాతోనూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించారు. ఇక 'ఆర్ఆర్ఆర్'తో కూడా బాక్సాఫీస్ వద్ద మరెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో  చూడాలి. మరోవైపు తారక్‌, చరణ్‌లకు ఈ చిత్రం సక్సెస్ చాలా అవసరం అనే సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement