RRR Press Meet: SS Rajamouli Shares Hilarious Incident During RRR Movie Shoot - Sakshi
Sakshi News home page

పెళ్లిళ్లు అయ్యాయి.. అయినా అదేపని.. తారక్, చరణ్ పై జక్కన్న కంప్లైంట్, గట్టిగా గిల్లిన ఎన్టీఆర్‌

Published Sat, Dec 11 2021 1:08 PM | Last Updated on Sat, Dec 11 2021 3:31 PM

RRR Press Meet: SS Rajamouli Shares Hilarious Incident During RRR Movie Shoot - Sakshi

రాజమౌళి సినిమా ప్రమోషన్ ప్లానింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో బాహుబలితో  క్లియర్ గా ప్రూవ్ అయింది. భారీ సినిమాలు తీయడమే కాదు.. దాన్ని జనాల్లోకి కూడా అదే రేంజ్‌లో తీసుకెళ్తాడు. విడుదలకు చాలా రోజుల ముందునుంచే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేస్తాడు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలోనూ అదే ఫాలో అవున్నాడు. సినిమా విడుదల తేది(జనవరి7) దగ్గరపడుతుండడంతో వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ముంబై, బెంగళూరులో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌.. తాజాగా హైదరాబాద్‌లో మీడియాలో చిట్‌చాట్‌ చేసింది. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ గురించి విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలో అక్కడ ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ జరిగింది. తారక్‌, రామ్‌ చరణ్‌ల గురించి మీడియాకు కంప్లైంట్‌ ఇచ్చాడు జక్కన్న. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ సమయంలో చెర్రీ, తారక్‌ వల్ల చాలా ప్రాబ్లమ్స్‌  ఎదుర్కొన్నానని చెప్పారు.‘ మూవీ షూటింగ్‌ దాదాపు 300 రోజులు జరిగితే.. అందులో 25 రోజులు వీరిద్దరి వల్లే వృధా అయింది. ఇద్దరికీ 30 ఏళ్ల వయసు దాటింది.. పెళ్లి అయింది.. కోట్ల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది కానీ.. సెట్లో మాత్రం వీరిద్దరు గొడవపడేవారు. ఎన్టీఆర్‌ నా దగ్గరు వచ్చి.. ‘జక్కన్నా నన్ను చరణ్‌ గిల్లాడు అని తారక్‌ అంటే.. చరణ్‌ వెంటనే ‘నేనా.. ఎప్పుడు గిల్లాను.. నేను స్క్రిప్ట్ లైన్స్ చదువుకుంటున్నాను’అని అమాయకపు ముఖం పెట్టి చెప్పేవాడు. వీరి గొడవ వల్ల నా షూటింగ్‌ నిలిచిపోయేది’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాలను చెబుతున్న సమయంలో పక్కనే ఉన్న ఎన్టీఆర్‌.. రాజమౌళిని గట్టిగా గిల్లాడు. దీంతో వెంటనే ఎగిరిపడి లేచిన జక్కన్న.. పక్కకి వచ్చి విషయానంతా చెప్పాడు. ప్రస్తుతం జక్కన్నని ఎన్టీఆర్‌ గిల్లిన వీడియో వైరల్‌ అవుతోంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement