‘అమృత ప్రేమలో విరాట్.. మనసులో మాట’ | sai Dharam Tej Released Another Song From Solo Brathuke So Better | Sakshi
Sakshi News home page

‘అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట’

Published Wed, Aug 26 2020 10:42 AM | Last Updated on Wed, Aug 26 2020 12:41 PM

sai Dharam Tej Released Another Song From Solo Brathuke So Better - Sakshi

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’’‌ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ రోజు (మంగళవారం) ఉదయ 10 గంటలకు సినిమా నుంచి రెండో పాటను హీరో ధమ్‌ తేజ్‌ తన ట్విటర్‌లో విడుదల చేశారు. ‘హేయ్‌ ఇది నేనేనా.. హేయ్‌ ఇది నేజమేనా’ అంటూ సాగే ఈ పాటలో సోలోగా ఉండాలనుకున్న హీరో.. హీరోయిన్‌ పరిచయమయ్యాక తన ప్రేమలో పడి విహరిస్తున్నట్లు కన్పిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘నో పెళ్లి’ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ కూడా సందడి చేయడం విశేషం. మరి ఈ సాంగ్‌ అభిమానులకు ఎలా చేరుతుందో వేచి చూడాలి. (అమృతను చూశాక విరాట్‌కు ఏమైంది?)

ఇక నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు సుబ్బు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తమన్‌ స‍్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకోగానే త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా అనంతరం దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. (సాయి ధరమ్‌ తేజ్‌ ఆసక్తికర ట్వీట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement