Sam Jam With Naga Chaitanya: Samantha Interviewed Chaitanya For Sam Jam Season Finale - Sakshi
Sakshi News home page

నాకు నీ గురించి అన్నీ తెలుసు: చై

Published Mon, Jan 4 2021 1:39 PM | Last Updated on Mon, Jan 4 2021 3:37 PM

Samantha Interviews Naga Chaitanya For Sam Jam - Sakshi

చిలిపి నవ్వు, ఓర చూపుతో అందరినీ మాయ చేసే ముద్దుగుమ్మ సమంత. ఇలా మాయ చేసే నాగ చైతన్యను బుట్టలో వేసుకుని అతడితో ఏడడుగులు నడిచారు. ఇక మామ నాగార్జున కోరిక మేరకు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రశంసలు దక్కించుకున్నారు. ఇదే ఎనర్జీతో ఓటీటీ వేదిక ఆహాలో సామ్‌ జామ్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో సామ్‌ భర్త, హీరో నాగచైతన్య అతిథిగా వస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఎప్పుడూ తన ప్రశ్నలతో అందరినీ తికమక పెట్టే సమంతకు చై రివర్స్‌ కౌంటర్లిస్తూ చెమటలు పట్టిస్తున్నారు. అయితే.. 'ఇంట్లోనే పడుంటాడు, ఎప్పుడైనా వస్తాడు అని చివర్లో పిలిచావు కదా!' అంటూ కాస్త హర్టయ్యాడు. దీంతో తన నవ్వుతో భర్త అలకను పోగొట్టిన సామ్‌.. హోస్ట్‌గా నాకు ఎన్ని మార్కులేస్తావు? అని ఉత్సాహంగా అడిగారు. హోస్ట్‌గా అదరగొడుతున్నారు కాబట్టి చై తప్పకుండా ఆమెకు మంచి మార్కులే వేసుంటారు. "ఒకేసారి చాలామంది అమ్మాయిలను ఫ్లర్ట్‌ చేశావా?" అన్న ప్రశ్నకు చై సమాధానం చెప్పకుండా తప్పించుకోడానికి ట్రై చేసినట్లు కనిపించింది. (చదవండి: సమంతకు బంపర్‌ ఆఫర్‌ : నయారోల్‌లో)

నా వంటకు ఎన్ని మార్కులిస్తావు? అని సామ్‌ అడిగిన ప్రశ్నకు అసలేం అడుగుతున్నావు అని నిలదీశారు. ఇంటిని మ్యానేజ్‌ చేయడంలో నాకెన్ని పాయింట్లిస్తావు? అన్న దానికి కూడా అది నీకేం వచ్చన్నట్లుగా ఎదురు ప్రశ్నించారు. పనిలో పనిగా ఇంట్లో తను ఏదైనా సలహా ఇస్తే తీసుకోదన్న విషయాన్ని కూడా బయటపెట్టారు. తర్వాత చై మాట్లాడుతూ.. నేను కాలేజీకి వెళ్లి బ్యాక్‌ బెంచ్‌లో కూర్చున్నా, నువ్వు కాలేజీకి అయినా వెళ్లావా? అని అందరి ముందే పరువు తీయడంతో సామ్‌ నోరు తెరిచారు. 'ఈ సారి నువ్వు నీ గెస్ట్‌ను తికమతక పెట్టలేవు, ఎందుకంటే నాకు నీ గురించి అన్నీ తెలుసు' అని చెప్పేయడంతో సామ్‌ దొరికిపోయానన్నట్లుగా ముసిముసిగా నవ్వారు. ఈ ప్రోమో సామ- చై అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే జనవరి 8 వరకు వేచి చూడాల్సిందే! విజయ్‌ దేవరకొండ, మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌ వంటి పలువురు స్టార్లు పాల్గొన్న సామ్‌ జామ్‌ షో ఇప్పటివరకు 8 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. చైతన్య సందడి చేయనున్న తొమ్మిదో ఎపిసోడ్‌తో ఈ షో మొదటి సీజన్‌ పూర్తవుతుంది. (చదవండి: గోవాలో స్నేహితులతో సందడి చేస్తున్న చైసామ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement