మూవీ ముచ్చట్లు: రాబోయే సినిమాలు ఇవే | Telugu Upcoming Movies | Sakshi
Sakshi News home page

మూవీ ముచ్చట్లు.. రాబోయే సినిమాలు ఇవే

Published Tue, Jan 26 2021 8:28 AM | Last Updated on Tue, Jan 26 2021 8:34 AM

Telugu Upcoming Movies - Sakshi

ఈ వారం ఆరంభమే సినీప్రియులకు కొత్త కబుర్లు మోసుకొచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్,  కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం) దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది. ఈ చిత్రం తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని ఎలా ప్రారంభించారనేదే కథాంశం’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య.

ఈ దీపావళి (నవంబర్‌ 4)కి రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ని విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ పేర్కొంది. ఈ చిత్రానికి శివ దర్శకుడు.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 16న విడుదల కానుంది.

ఎన్నాళ్లగానో వార్తల్లో ఉన్న మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ ప్రారంభమైంది. పవన్‌ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో సాగర్‌. కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయితేజ్‌ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘రిపబ్లిక్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు.

‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన నవీన్‌ చంద్ర ఆ తర్వాత హీరోగా చేయడంతో పాటు కీలక పాత్రలు కూడా చేస్తున్నారు. తాజాగా హీరోగా ఓ సినిమా కమిట్‌ అయ్యారు. అరవింద్‌ దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement