వెబ్ దునియాలో ఈ మధ్య బాగా వినపడుతున్న పేరు ఆంచల్ సింగ్. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘యే కాలీ కాలీ ఆంఖే’లో ఆమె నటనే అందుకు కారణం.ముఖ కవళికలతోనే అభినాయన్ని ప్రదర్శించి వెబ్ వీక్షకుల అభిమానాన్ని దోచుకుంది. ఆమె పరిచయం క్లుప్తంగా ఇక్కడ.
►ఆంచల్ సింగ్ పుట్టింది, పెరిగింది చండీగఢ్‌లో. తల్లిదండ్రులు.. గున్‌బీర్ కౌర్, గురుబక్స్ సింగ్.
►ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందింది. కాలేజ్‌లో చదువుతున్నప్పుడే వ్యాపార ప్రకటనల్లో నటించింది. ఆ సమయంలోనే అనుకుంది నటనా రంగమే తాను చేరుకోవాల్సిన గమ్యం అని. అనిపించిందే తడవుగా సినిమా రంగంలో అవకాశాల కోసం ముంబై చేరింది.
► అయితే ఆమెను మొదట గుర్తించింది శ్రీలంకన్ సినిమా. సింహళీలో వచ్చిన ‘శ్రీ సిద్ధార్థ గౌతమ’లో ఆమె యశోధరగా నటించి మెప్పించింది.
► ఆ సింహళీ చిత్రమే ఆమె పై భారతీయ సినీపరిశ్రమ దృష్టి పడేలా చేసింది. వెంటనే తమిళ్ ఇండస్ట్రీ ‘దిల్లుకు దుడ్డు’తో చాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమె షెడ్యూల్ డైరీలో ఖాళీ డేట్స్ కనిపించలేదు.
► ఓవైపు తమిళ్, పంజాబీ వంటి ప్రాంతీయ భాషా చిత్రాలు, ఇంకో వైపు బాలీవుడ్ స్క్రీన్, మరో వైపు టెలివిజన్ సీరియల్స్, టీవీ కమర్షియల్స్‌లో నటిస్తూ తాను కోరుకున్న ఫీల్డ్‌లో తనేంటో నిరూపించుకుంది.. తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
► ఇటీవలే అన్‌దేఖీ, యే కాలీ కాలీ ఆంఖే సిరీస్‌తో వెబ్ మీడియంలోకి ప్రవేశించి అక్కడా తన ముద్ర వేసుకుంది.
► యాక్టింగ్ కెరీర్ నాకేమీ వడ్డించిన విస్తరి కాదు. అందరు నటీనటుల్లాగే మొదట్లో నేనూ చాలా తిరస్కారాలకు గురయ్యా. నా మీద నాకున్న నమ్మకమే నన్ను ముందుకు నడిపించింది.. ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు నేను పొందుతున్న ఆదరణ, అభిమానం చూస్తుంటే సంతోషంతో నా మనసు నిండిపోతుంది.
అదే సమయంలో కించిత్ భయమూ వెంటాడుతుంది.
– ఆంచల్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment