Will Mahesh Babu Sarkaru Vaari Paata Get Postponed Again? - Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌ బాబు 'సర్కారు వారి పాట' మళ్లీ వాయిదా !.. కారణం ?

Published Fri, Jan 14 2022 2:38 PM | Last Updated on Fri, Jan 14 2022 3:20 PM

Will Mahesh Babu Sarkaru Vaari Paata Get Postponed Again - Sakshi

Will Mahesh Babu Sarkaru Vaari Paata Get Postponed Again: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహించగా 'మహానటి' కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 14) థియేటర్లలో సందడి చేయాల్సింది. దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌)ను జనవరి 7న రిలీజ్‌ చేస్తామని ప్రకటించడం, పలు కారణాలతో 'సర్కారు వారి పాట' మూవీ విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. తర్వాత ఏప్రిల్‌ ఒకటిన రిలీజ్‌ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే మళ్లీ తాజాగా ఈ డేట్‌కు కూడా విడుదల చేయడం అనుమానమే అంటున్నాయి సినీ వర్గాలు. 

ఎందుకంటే మహేశ్ బాబుతో పాటు హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ఇద్దరికి కూడా కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వీళ్లిద్దరూ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు. ఇదే కాకుండా ఇటీవల మహేశ్‌ బాబుకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇలాంటి కారణాలు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్‌ 1 తేదికి సినిమా పూర్తయ్యే సూచనలు కనిపించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 'సర్కారు వారి పాట' రిలీజ్‌ను వాయిదా వేయటం తప్ప మరో అవకాశం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితులన్నీ సవ్యంగా చక్కబడి సినిమా షూటింగ్‌ పూర్తియ్యాక సినిమాను ఆగస్టు 5న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

ఇదీ చదవండి: సర్జరీ కోసం అమెరికా వెళ్తున్న మహేశ్‌బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement