అంగరంగ వైభవంగా దీపావళి
● జిల్లాలో అంబరాన్నంటిన సంబురాలు
ములుగు: రంగురంగుల కాంతుల మధ్య జిల్లా వాసులు గురు, శుక్రవారాల్లో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో పండుగ వేడుకలు సంబురంగా చేశారు. బాణసంచా ధరలు రెట్టింపు అయినా ప్రజలు, యువతీయువకులు కొనుగోలు చేస్తూ కనిపించారు. యువతులు ఇంటి ముందు ముగ్గులు వేసి అలంకరించారు. మహిళలు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేలా ఇంటిముందు దీపాలను వెలిగించారు. దీపావళి సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొందరు గురువారం, మరికొందరు శుక్రవారం నోములు నోచుకున్నారు. పండుగ వేళ నోములు నోచుకున్న తర్వాత రోజు చేపల కోసం ఎగబడడంతో చిరువ్యాపారులు ఒక్కసారిగా ధరను పెంచి విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment