‘ఆయుష్మాన్ భారత్’తో రూ.5లక్షల బీమా
వెంకటాపురం(ఎం) : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులు నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని బూర్గుపేట గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధుల ఆరోగ్యానికి రూ.5లక్షల ఆరోగ్యబీమా పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య జవహర్లాల్, ప్రధాన కార్యదర్శి శ్రీమంతుల రవీంద్రాచారి, మండల అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు జినుకల కృష్ణాకర్రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment