ప్రతీ ఇంటికి స్టిక్కరింగ్
వెంకటాపురం(కె)/ములుగు: ఎన్యుమరేషన్ బ్లాక్‌లో ఇంటి జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టా లని, ప్రతీఇంటికి స్టిక్కర్ వేయాలని కలెక్టర్ దివా కర అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని బొల్లారం, నూగూరు, చొక్కాల, వెంకటాపురం గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రా జకీయ, కుల సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ తీరు ను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్‌లో ఒక ఇల్లు కూడా వదిలి వేయకుండా ఇంటి జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టాలన్నారు. మండల అభివృద్ధి అధికారులు, తహసీల్దా ర్లు, మండల పంచాయతీ అఽధికారులు, మండల ప్ర త్యేక అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎనిమిరేటర్లు, సూపర్‌వైజర్లతో సమన్వయం చేసుకోని ఏ రోజు ఏ గ్రామంలో సర్వే జరుగనుందో ఆ వివరాలను ప్రజలకు ముందస్తుగా తె లియజేయాలన్నారు. ఆయా రోజుల్లో ప్రజలు సర్వే కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
తొలిరోజు 34,838 ఇళ్లకు స్టిక్కరింగ్
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం తొ మ్మిది మండలాల్లోని 174 గ్రామపంచాయతీల పరి ధిలో 34,838 ఇళ్లకు స్టిక్కర్ చేశారు. ఈ మేరకు 874 మంది ఎన్యుమేటర్లు ఇందులో పాల్గొన్నారు.
ఏటూరునాగారంలో..
ఏటూరునాగారం: ఎన్యుమరేషన్ బ్లాక్‌లో ఇళ్ల జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని ముళ్లకట్ట గ్రామంలో కలెక్టర్ పర్యటించి సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీష్, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
● ఇంటింటి సర్వేను పరిశీలించిన కలెక్టర్ దివాకర
Comments
Please login to add a commentAdd a comment