సమన్వయంతో పనిచేయాలి
ములుగు: వైద్యారోగ్యశాఖ లక్ష్యాలను చేరాలంటే వై ద్యాధికారులు, ఆయా పీహెచ్‌సీ పరిధిలోని ఆశకార్యకర్తలు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో డీఎంహెచ్‌ఓగా గోపాల్‌రావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విపిన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఉద్యోగులకు ఏమైనా సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ కార్యక్రమాలైన మాతాశిశు ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, టీబీ, కీటక జనిత వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. అంతకు ముందు గోపాల్‌రావుకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. అనంతరం జిల్లా నుంచి బదిలీ అయిన అల్లెం అప్పయ్యను సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రణధీర్, వైద్యులు శ్రీకాంత్, పవన్, భవ్యశ్రీ, ఏఎంఓ దుర్గారావు, డెమో సంపత్, డీపీఎమ్మెస్ సాంబయ్య, సంజీవరావు, సూపరింటెండెంట్ విజయభాస్కర్, సీనియర్ అసిస్టెంట్ గణేష్, యూనిట్ ఆఫీసర్స్ వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, సాంబయ్య, వినోద్, స్వామి, ప్రవీణ్, షమాపర్వీన్, ధరణిపూజిత, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావుబాధ్యతల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment