వేగవంతంగా ట్రైబల్ యూనివర్సిటీ ఫైల్
ములుగు : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం(2014)లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేర కు ఏర్పాటు చేయాల్సిన కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్ణయం అనూహ్య మలుపుల మధ్య జిల్లాలోని గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మంత్రివర్గం తీసుకు న్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్ చకచక కదులు తోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రైబల్ యూ నివర్సిటీ ఏర్పాటుకు 337 ఎకరాలు కేటాయించినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. 2024వ సంవత్సరం నుంచి తాత్కాలికంగా తరగతుల ప్రా రంభానికి మండలంలోని జాకారంలో ఉన్న ఐటీడీఏ యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనాన్ని ఎంపిక చే సింది. తాజాగా శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం తరఫున గట్టమ్మ ఆలయం సమీపంలోని సర్వే నంబర్ 837/1లో 211.26 ఎకరాల భూమిని కేటాయిస్తూ రెవెన్యూ యాక్ట్ ప్రకారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి రూ. 5 లక్షలుగా ధర నిర్ణయించారు. మొత్తం 211 ఎకరాల 26గుంటల భూమికి గానూ రూ.10.58కోట్ల అవార్డు చెల్లించారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించేందుకు తాత్కాలిక భవనంలో సన్నాహాలు చేయగా అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మొదటి సంవత్సరంలో బీఏ హానర్స్ ఇంగ్లిష్, బీఏ హానర్స్ ఎకనామిక్స్‌లో ఉన్న 47 ఖాళీలకు కేవలం 13 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ కారణంగా తరగతుల నిర్వహణ ప్రక్రియ ఆలస్యమైంది. ఏది ఏమైనా విభజన చట్టం ప్రకారం పదేళ్ల తర్వాత ట్రైబల్ యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమల్లోకి మంత్రివర్గ నిర్ణయం
యూనివర్సిటీకి 211.26 ఎకరాల స్థలం కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment