● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక విద్యార్థులతో కలిసిపోతున్న ఫారినర్స్‌ ● ఇక్కడి చారిత్రక ప్రదేశాలకు ఫిదా ● బతుకమ్మ పండుగ, సర్వపిండి ఎంతో ఇష్టమని వెల్లడి ● స్వదేశానికి వెళ్లినా ఓరుగల్లు సంస్కృతీసంప్రదాయాలకు గౌరవం | - | Sakshi
Sakshi News home page

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక విద్యార్థులతో కలిసిపోతున్న ఫారినర్స్‌ ● ఇక్కడి చారిత్రక ప్రదేశాలకు ఫిదా ● బతుకమ్మ పండుగ, సర్వపిండి ఎంతో ఇష్టమని వెల్లడి ● స్వదేశానికి వెళ్లినా ఓరుగల్లు సంస్కృతీసంప్రదాయాలకు గౌరవం

Published Mon, Nov 18 2024 1:25 AM | Last Updated on Mon, Nov 18 2024 1:26 AM

● దాస

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

విదేశీయులం కాదు మేం ఓరుగల్లు స్వదేశీయులం అంటున్నారు.. నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో విద్యనభ్యసిస్తున్న ఫారినర్స్‌. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను అక్కున చేర్చుకుని నిట్‌ క్యాంపస్‌ అమ్మలా ఆదరిస్తోంది. వారి భద్రతకు పెద్దపీట వేస్తోంది. సొంతూరిలో ఉన్న అనుభూతిని కల్పిస్తోంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్‌.

– కాజీపేట అర్బన్‌

సంతోషంగా

బతుకమ్మ ఆడుతా

మాది ఖతర్‌. నాకు నిట్‌ వరంగల్‌కు రావాలంటే మొదట భయం వేసింది. అడ్మిషన్‌ తీసుకున్నాక స్నేహితులు పెరిగారు. భయం పూర్తిగా తగ్గిపోయింది. మా దగ్గర లేని ఎన్నో పండుగలను నిట్‌ వరంగల్‌లో జరుపుకుంటాం. నాకు ప్రత్యేకంగా బతుకమ్మ ఆట అంటే చాలా ఇష్టం. ఎంతో ఉత్సాహంగా నేను మా స్నేహితులం బతుకమ్మ ఆడతాం. పండుగలు జరుపుకోవడం అంటే ఆనందం పంచుకోవడమే కాకుండా పరస్పరం ఒకరి గురించి మరొకరం తెలుసుకునే అవకాశం ఉంటుంది.

– గాయత్రి, ఖతర్‌,

మెకానికల్‌ సెకండియర్‌

ఇంటిని తలపించే వాతావరణం

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ సొంత ఇంటిని తలపించేలా ఉంది. నేను భూటాన్‌ నుంచి వచ్చినా కూడా.. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు అంటే చాలా ఇష్టమయ్యేలా నిట్‌ వరంగల్‌ నేర్పించింది. ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు కై ట్స్‌ ఎగురవేస్తున్నాం. దసరా, దీపావళి, హోలీ పండుగలను కలర్‌ఫుల్‌గా జరుపుకుంటున్నాం. భూటాన్‌లోని మా సొంత ఊరికి వెళ్లినప్పుడు తెలంగాణ పండుగలను మా వారికి పరిచయం చేస్తున్నా.

– సోనమ్‌ షెవాంగ్‌, భూటాన్‌,

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, సెకండియర్‌

నిట్‌ చాలా బాగుంది..

నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ చాలా బాగుంది. అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. రష్యా కంటే కూడా నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ ఎంతో సేఫ్‌ అనిపిస్తుంది. తరచూ నగరంలోని భద్రకాళి, వేయిస్తంభాల ఆలయం దర్శిస్తుంటా. నిట్‌ వరంగల్‌కు దగ్గరలో ఉన్న దాబాలో టేస్టీ ఫుడ్‌ తినడం చాలా ఇష్టం. ఎంటెక్‌ కూడా నిట్‌లో చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రతీ ఏడాది నిట్‌లో నిర్వహించే టెక్నోజియాన్‌, స్ప్రింగ్‌స్ప్రీ ప్రోగ్రాంలో తెలుగు విద్యార్థులతో పోటీ పడి పాల్గొంటున్నా.

– సామ్రాట్‌, రష్యా, సీఎస్‌ఈ ఫోర్త్‌ ఇయర్‌

తెలంగాణ ఫుడ్‌ చాలా ఇష్టం

నేను ఇండోనేషియా నుంచి నిట్‌ వరంగల్‌లో దాసా ద్వారా అడ్మిషన్‌ పొందిన తర్వాత ఇక్కడి ఫుడ్‌ను టేస్ట్‌ చేయడం ప్రారంభించా. నిట్‌లోని హాస్టల్స్‌లో అందించే నార్త్‌ ఇండియన్‌తోపాటు తెలంగాణ ఫుడ్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యేకంగా తెలంగాణ చికెన్‌, సర్వ పిండి ఎంతో ఇష్టంగా తింటాను. ఇండోనేషియాకు వెళ్లడం కంటే ఇండియాలోనే ఉండిపోవాలని ఉంది.

– ఫర్రాస్‌ చైదర్‌, ఇండోనేషియా, మెకానికల్‌ థర్డ్‌ ఇయర్‌

పరదేశీ విద్యార్థులను అక్కున చేర్చుకుంటున్న వరంగల్‌ నిట్‌

నిట్‌ వరంగల్‌లో విదేశీ విద్యార్థులు చేరేందుకు 2001లో అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా దాసా భవనం ఏర్పాటు చేశారు. కాగా.. ప్రతీ ఏడాది బీటెక్‌ ప్రథమ సంవత్సరంలోకి 1,300 మంది విద్యార్థులు జేఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా జోసా అడ్మిషన్స్‌తో ప్రవేశం పొందుతున్నారు. 1,300 సీట్లలో 90 సీట్లను డైరెక్ట్‌ అడ్మిషన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ అబ్రాడ్‌(దాసా) పేరిట విదేశీ విద్యార్థులకు ప్రవేశం లభిస్తోంది. ఈ విద్యాసంస్థలో ఇండోనేషియా, రష్యా, ఖతర్‌, నేపాల్‌, నైజీరియా తదితర దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారు.

అడ్మిషన్‌ ఫీజు తక్కువే..

విదేశాల్లో రూ.లక్షల్లో అడ్మిషన్‌ ఫీజులు ఉండగా.. నిట్‌ వరంగల్‌లో దాసా విద్యార్థులకు 42,500 అడ్మిషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు దాసా ద్వారా నిట్‌ వరంగల్‌లో అడ్మిషన్‌ పొందే అవకాశం ఉంటుంది. అత్యుత్తమ ఇంజనీరింగ్‌ విద్యాబోధనతోపాటు క్యాంపస్‌ సెలక్షన్స్‌కు ప్రత్యేక వేదికగా నిలుస్తున్న నిట్‌ వరంగల్‌లో చేరేందుకు విదేశీయులు ఆసక్తి కనబరుస్తున్నారు.

భద్రత, స్నేహభావానికి ప్రతీక ఓరుగల్లు

విదేశీయులు తమ సొంత ఊరిలో ఎలా స్వేచ్ఛగా భద్రంగా జీవనం కొనసాగిస్తారో.. అంతకు మించి భద్రతను కల్పిస్తున్నది ఓరుగల్లు నగరం. ఇక్కడ విద్యనభ్యసించేందుకు తమ పిల్లలను పంపించేందుకు విదేశాల్లో ఉన్నవారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇక్కడి పండుగల్లో స్థానిక విద్యార్థులతో కలిసి విదేశీయులు పాల్గొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి1
1/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి2
2/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి3
3/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి4
4/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి5
5/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి6
6/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి7
7/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి8
8/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి9
9/9

● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక వి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement