రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏటూరునాగారం/ములుగు రూరల్ : జిల్లాలోని గిరిజన భవన్‌లో 68వ అండర్–17 బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) కరాటే సెలక్షన్ పోటీలు నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో ఏటూరునాగారం కరాటే క్లబ్‌కు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు కరాటే అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బు తెలిపారు. ఈ పోటీల్లో ఏటూరునాగారం గ్రామానికి చెందిన సీహెచ్ ఐశ్వర్య, కె.శ్రీహరిణి, అలువాల విఘ్నశ్రీ, విశాల్, గణేశ్, హర్షవర్ధన్, అన్వేష్, దినేష్, చరణ్, రూమేశ్ బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌కి ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–14లోపు విభాగంలో బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో నిర్వహించారు. ఏటూరునాగారం (మల్లంపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి రాజేష్ బాక్సింగ్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా డీఈఓ పాణిని హాజరై విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. పీడీ శ్రీధర్, పీఈటీ ప్రశాంత్, అంకయ్య, వాసుదేవ్, రహీం పాషా, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శోభన్‌బాబు, తిరుపతి, హేమాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment