జోనల్ క్రీడా పోటీల్లో బాలికల ప్రతిభ
ములుగు రూరల్ : జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో ములుగు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినులు పతకాల సాధించి, పలు క్రీడలలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నర్మద బాయి, ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల ఆవరణలో ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు లక్షేట్టిపేటలో కాళేశ్వరం 10వ జోనల్ స్థాయి గురుకుల పాఠశాల క్రీడా పోటీలు జరిగాయి. ఈ క్రీడల్లో ములుగు సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, వివిధ క్రీడా అంశాలలో స్వర్ణ పతకాలు–8, రజత –2, కాంస్య–2 సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్, అండర్–19 కబడ్డీలో రన్నరప్, చెస్ స్వర్ణం, అండర్–14లో టెన్నికాయిట్‌లో రన్నరప్‌గా నిలిచి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని, క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు స్నేహభావం ఏర్పడుతుందని, మరింత ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో స్వాతి, త్రివేణి, శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అభినందించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
Comments
Please login to add a commentAdd a comment