సర్వం సిద్ధం
టోల్ ఫ్రీ నంబర్..
అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై వారి ఫొటో సరిగా కనబడనిచో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సంతకంతో పాటు డిక్లరేషన్ పత్రంపై గెజిటెడ్ అధికారులు సంతకం, ముద్ర తప్పనిసరి. సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్ 18004257109 ఏర్పాటు చేశారు.
ములుగు : గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు అధికారులు జిల్లాలో ఏర్పాట్లు చేశారు. జిల్లాకేంద్రంతో పాటు చుట్టు పక్కల తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆది, సోమవారాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. 17వ (నేడు) తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్నాహ్నం 12:30 నిమిషాల వరకు (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ), మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు(పొలిటికల్ అండ్ సొసైటీ), 18వ (సోమవారం) ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్ష రెండున్నర గంటల పాటు ఉండనుంది.
కేంద్రాల వద్ద 144 సెక్షన్..
అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100మీటర్ల వరకు పోలీసులు 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలో పరీక్షలు పూర్తయ్యేంత వరకు జిరాక్స్ సెంటర్లు, ఇతర బుక్‌స్టాల్స్‌ను మూసి ఉంచనున్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌తో పాటు ఏఎన్‌ఎం/హెల్త్ అసిస్టెంట్లు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. అభ్యర్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజనల్ ఫొటో ఐడీని తమ వెంట తీసుకురావాలి. సమాధానాలు నీలం/నలుపు బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే రాయాలి. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అభ్యర్థులను బయటికి పంపరు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడనున్నారు. సురక్షిత తాగునీటిని అందించనున్నారు. అభ్యర్థులకు అనుగుణంగా ఏటూరునాగారం నుంచి నాలుగు, హనుమకొండ నుంచి నాలుగు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
2,173మంది గ్రూప్–3 అభ్యర్థులు
జిల్లాలో తొమ్మిది సెంటర్ల ఏర్పాట్లు
నేడు రెండు పేపర్లు, రేపు ఒకటి
పరీక్ష కేంద్రాలు ఇవే..
జాకారం సోషల్ వెల్ఫేర్
గురుకుల పాఠశాల
సాధన హైస్కూల్, ములుగు
బాలుర ఉన్నత పాఠశాల, ములుగు
లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, ములుగు
బాలాజీ ఇంటిగ్రేటెడ్
హైస్కూల్, ములుగు
ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల
బ్రిలియంట్ గ్రామర్
హైస్కూల్, ములుగు
తెలంగాణ మోడల్ స్కూల్,
బండారుపల్లి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
ప్రేమ్‌నగర్
అన్ని ఏర్పాట్లు చేశాం..
గ్రూప్–3 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇన్విజిలేటర్లు, ఫ్లోర్ ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్, ఫ్‌లైయింగ్‌స్వ్కాడ్‌లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. తొమ్మిది సెంటర్లలో 2,173మంది అభ్యర్థులు రెండు రోజుల పాటు పరీక్షలు రాయనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం పరీక్ష రాసేవారు 8గంటల నుంచి 9:30 నిమిషాల మధ్య, సాయంత్రం పరీక్ష రాసేవారు మధ్యాహ్నం 1:30 నిమిషాల నుంచి 2:30 నిమిషాల మధ్యలో వస్తేనే అనుమతి ఇస్తారు.
– టీఎస్ దివాకర, కలెక్టర్
2,173మంది అభ్యర్థులు
నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ అవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన కేంద్రాల్లో 2,173మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 8మంది దివ్యాంగ అభ్యర్థులు ఉన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక గదితో పాటు అదనంగా 50నిమిషాల సమయం కేటాయించనున్నారు. పరీక్షల నిర్వహణకు 9మంది పరిశీలకులు, 9మంది సూపరింటెండెంట్స్, ముగ్గురు ఫ్లైయింగ్‌సా్‌వ్క్‌డ్, 10మంది ఇన్విజిలేటర్లు, 120 ఫ్లోర్ ఇన్విజిలేటర్లను నియమించారు. వీరికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment