ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం | - | Sakshi
Sakshi News home page

ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం

Published Mon, Nov 18 2024 1:26 AM | Last Updated on Mon, Nov 18 2024 1:26 AM

ఇందిర

ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/హన్మకొండ చౌరస్తా : కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన వేడుకలకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల కోసం శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరగగా.. శనివారం మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ హనుమకొండలో ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా హనుమకొండకు చేరుకున్న టీపీసీసీ చీఫ్‌, మంత్రుల బృందానికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ..

మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 19న హనుమకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సక్సెస్‌పై గంటన్నరకు పైగా ఆయన ఈ కీలక భేటీ నిర్వహించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున నిర్వహించే ఈ విజయోత్సవ సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ప్రజలను తరలించే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా సీఎం కాన్వాయ్‌ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణానికి చేరేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి హెలిపాడ్‌ ఫైనల్‌ చేసే అవకాశం ఉంది. కాగా, ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందిని తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో లక్ష మంది మహిళలు ఉండేలా చూడాలని టీపీసీసీ చీఫ్‌ ప్రజాప్రతినిధులకు సూచించినట్లు సమాచారం. జన సమీకరణ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభం, ఏర్పాట్లపై నేడు, రేపు అధికారులతో మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి:టీపీసీసీ చీఫ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. హనుమకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని.. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే రేవంత్‌రెడ్డి సర్కారు ఆయా రంగాలను అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తోందని పేర్కొన్నారు. రూ.18 వేల కోట్లతో రైతులకు రుణమాీఫీ చేశామని, 40 శాతం కాస్మోటిక్స్‌ చార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు. కేసీఆర్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడని విమర్శించారు. పదేళ్లలో నిరుద్యోగులను విస్మరించి తన కుటుంబ సభ్యులకు మాత్రం రాజకీయ ఉద్యోగాలు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుందని, అందరం కలిసే పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్ట్స్‌ కళాశాలలోని ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’లో సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, వాహనాల పార్కింగ్‌ ఇతర అంశాలను కలెక్టర్‌ ప్రావీణ్య.. వారికి వివరించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్‌, ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్‌, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మురళీనాయక్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మహ్మద్‌ రియాజ్‌, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ప్రజా పాలన విజయోత్సవ సభా వేదికకు నామకరణం..

ఓరుగల్లులోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఇందిర జయంతి రోజునే బహిరంగ సభ

ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ చీఫ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు

ప్రజాప్రతినిధులతో మహేశ్‌కుమార్‌గౌడ్‌ భేటీ.. దిశానిర్దేశం

No comments yet. Be the first to comment!
Add a comment
ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం1
1/1

ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement