రామప్పలో భక్తుల సందడి
వెంకటాపురం(ఎం) : మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామి కి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించగా, టూరిజం గైడ్‌లు ఆలయ విశిష్టతను పర్యాటకులకు వివరించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకొని ప్రకృతి అందాలను తిలకించారు.
గ్రంథాలయ వారోత్సవాలు
ములుగు : విద్యాసముపార్జనకు గ్రంథాలయాలు నెలవని పలువురు కవులు, రచయితలు అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లాకేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో కవులు, రచయితలు గ్రంథాలయ పితామహుడు ఎస్వీ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిసమ్మేళనం నిర్వహించారు. దుర్గం మల్లయ్య, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దుర్గం సూరయ్య, సాదయ్య, శ్రీనివాస్,రాజు, లెనిన్, హమీద్, నాగేందర్, రాజమౌళి, కుమారస్వామి, సమ్మక్క, నిఖిల్, రాకేష్ పాల్గొన్నారు.
ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్
ములుగు రూరల్ : గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందజేస్తున్న ఆశ కార్యకర్తలకు ఫిక్స్‌డ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఆశ కార్యకర్తలతో కలిసి శనివారం జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశలకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో వారు శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. అనంతరం జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన గోపాల్‌రావును ఆశ కార్యకర్తల యూనియన్ నాయకులు శాలువాలతో సన్మానించా రు. గుండెబోయిన రవిగౌడ్, సత్యవతి, సరిత, శివ కుమారి, రమాదేవి, ప్రసన్నకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment