ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
వాజేడు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై 14వ విడత సామాజిక తనిఖీలో భాగంగా శనివారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనులపై ప్రిసైడింగ్ అధికారి మెరుగు వెంకట నారాయణ, జిల్లా విజిలెన్స్ అధికారి సాంబయ్య, ఎంపీడీఓ విజయ, ఏపీఓ సత్యేందర్, ఎస్‌ఆర్పీ నాగరాజుల సమక్షంలో చేపట్టిన పనులను వివరించారు. అంతకు ముందు చేపట్టిన సామాజిక తనిఖీల్లో ఏ ఏ గ్రామాల్లో ఎంత మేరకు తప్పిదాలు చోటు చేసుకున్నది సామాజిక తనిఖీ బృందాలు అధికారులకు వివరించారు. రూ.55,083 మేర తప్పిదాలు చోటు చేసుకోగా వెంటనే వాటిని చెల్లించాలని ఉపాధి సిబ్బందిని, రికవరీ చేసుకోవాలని ఏపీఓను అధికారులు ఆదేశించారు.
ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
వెంకటాపురం(ఎం) : మేలు జాతి పశువుల పెంపకం ద్వారా రైతులు పాల దిగుబడి పెంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా పశు వైద్యాధికారి కొమురయ్య పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని ఇంచెంచెరువుపల్లిలో గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 124 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ మందులను పంపిణీ చేశారు. 75 దూడలకు నట్టల నివారణ మందును వేశారు. సూపర్‌వైజర్ ఐలుమల్లు, గోపాల మిత్రలు పాల్గొన్నారు.
‘వెసులుబాటు కల్పించండి’
వాజేడు : జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొలతల్లో కోల్పోతున్న గృహాలకు వెసులుబాటు కల్పించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు. మండలంలో జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో కొలతలు వేస్తున్నారు. ఈ కొలతల్లో రహదారి వెంట ఉన్న గ్రా మాల్లోని ఇళ్లు కోల్పోయే అవకాశాలు ఉ న్నా యి. నానాకష్టాలు అనుభవించి నిర్మించుకున్న ఇళ్లు ఇప్పుడు విస్తరణ పనుల్లో కోల్పోతే తాము ఇబ్బందులు పడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ర హదారి విస్తరణ పనుల్లో కొంత వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment