విజయోత్సవ సభకు తరలిరావాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఈనెల 19న హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ప్రజా పాలన విజయోత్సవ సభకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలను భారీగా తరలించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు, సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం మేడారంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. సభకు ప్రజలు, మహిళలను తరలించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జిల్లా నుంచి వేలాదిమంది ప్రజలను తరలించి ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఈ సమావేశానికి ముందుగా మంత్రి సీతక్క సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అఽధ్యక్షురాలు రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మండల గౌరవ అధ్యక్షుడు అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి పరామర్శ
ములుగు రూరల్: మండలంలోని బంజరుపల్లి గ్రామానికి చెందిన కంచె రాధిక ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. రాధిక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment