మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతా
ములుగు/ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతానని మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయాల్లో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు. లైబ్రరీ ఆవరణలో నూతన మరుగుదొడ్లకు శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
సంస్కార హీనుల్ని పెంచిపోషిస్తున్న బీఆర్‌ఎస్
అధికారంలోకి వచ్చిన తెల్లారినుంచి ఇష్టమొచ్చినట్లు యూట్యుబ్ చానళ్లు, దొంగమీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న సంస్కారహీనులను బీఆర్‌ఎస్ పెంచిపోషిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి డివైడర్లపై మంగళవారం మంత్రి మొక్కలు నాటారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖతో కలిసి తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ఇబ్బందులకు గురిచేశారని, మహిళలపై దుష్ప్రచారం చేస్తే పురుగులు పట్టిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట కలెక్టర్ దివాకర టీఎస్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ అజయ్‌కుమార్, డీపీఓ దేవరాజ్, డీడబ్ల్యూఓ శిరీష, ఎంపీడీఓ రామకృష్ణ, ఈఓ పెంట రఘు తదితరులున్నారు.
తండాల అనుసంధానానికి ప్రాధాన్యం..
తండాల అనుసంధానం, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తూ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ దివాకరతో కలిసి శంకుస్థాపన చేశారు. సీతక్క మాట్లాడుతూ.. జాకారం నుంచి ఇంచెన్‌చెరువుపల్లి గ్రామానికి రూ.2.20 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు, వెంకటేశ్వర్లపల్లి నుంచి మాడలక్ష్మారెడ్డిపల్లి వరకు రూ.80 లక్షలతో బీటీ రో డ్డు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి యేసు నగర్ వరకు రూ.80 లక్షలతో, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి దేవనగర్ వయా యాపలగడ్డ వరకు రూ.1.20 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment