ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం.. | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

Published Wed, Nov 20 2024 1:28 AM | Last Updated on Wed, Nov 20 2024 1:27 AM

ఓరుగల

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం, నమస్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

రేపు డెడికేటెడ్‌ బీసీ కమిషన్‌ రాక

వరంగల్‌: హనుమకొండ కలెక్టరేట్‌లో డెడికేటెడ్‌ బీసీ కమిషన్‌ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్‌ చైర్మన్‌ బుసాని వెంకటేశ్వరరావు, సభ్యులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు అవసరమైన రిజర్వేషన్లను దామాషా ప్రకారం కల్పించేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజలు, సలహాలు, అభ్యర్థనలు, ఆక్షేపణలను కమిషన్‌కు సమాచారం, మెటీరియల్‌, సాక్ష్యాలతో సమర్పించవచ్చని కలెక్టర్‌ తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో

ఉత్తమ ప్రతిభ కనబర్చాలి

ములుగు రూరల్‌: రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ కరాటే క్రీడల్లో జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. ఈమేరకు మంగళవారం మండలంలోని బండారుపల్లి శివారులోని గిరిజన భవన్‌లో జిరిగిన కరాటే జిల్లా స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. అండర్‌–17 విభాగంలో బాలబాలికలు క్రీడల్లో పాల్గొన్నారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాజు, పీడీలు రాజు, నాగేందర్‌, మల్లయ్య, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.

ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాలి..

వెంకటాపురం(కె): ఏజెన్సీలో చట్టాలు, హక్కుల రక్షణ కోసం ఆదివాసీ యువత ఉద్యమించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మంగళవారం మండల పరిధి రాచపల్లిలో ఆదివాసీ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతానికి వలస వస్తున్నారని అక్రమ వలసలను అరికట్టాలన్నారు. ఆదివాసీ చట్టాలను అధికారులు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ యువత జాతి మనుగడ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆది నారాయణ, చంటి, లక్ష్మయ్య, సాయిబాబు తదితరులు ఉన్నారు.

జంగాలపల్లిలో కొనసాగిన

మెగా వైద్య శిబిరం

ములుగు రూరల్‌: మండలంలోని జంగాలపల్లిలో రెండో రోజు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మొత్తం 10 బృందాలు గ్రామంలోని 540 ఇళ్లను సందర్శించాయి. బృంద సభ్యులు ప్రతీ కాలనీలో సర్వే నిర్వహించి నిల్వ ఉన్న నీటిని తొలగించారు. దోమలు వృద్ధి చెందకుండా క్లోరినేషన్‌ చేపట్టారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రెండో రోజు వైద్య శిబిరంలో 212 మందికి ఓపీ సేవలు అందించి 45 మంది నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు రాయినిగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసాద్‌ తెలిపారు. 145 మందికి బీపీ, 50 మందికి మధుమేహం పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మాతా సంరక్షణ ఆరోగ్యం, పోషణ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌, అసిస్టెంట్‌ మలేరియా ఆఫీసర్‌ దుర్గారావు, వైద్యులు వైశాలి, నవ్యరాణి, నందకిషోర్‌, రవళి, నవ్య, తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ డీఆర్‌లు

విడుదల చేయాలని నిరసన

ములుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఆర్‌లను వెంటనే విడుదల చేయాలని రిటైర్మెంట్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం డిమాండ్‌ చేశారు. ఈమేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం సంఘ సభ్యులు కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ సంపత్‌రావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బానోత్‌ దేవ్‌సింగ్‌, రాష్ట్ర బాధ్యులు దుర్గం సూరయ్య, సలహాదారులు బాలునాయక్‌, సదానందం, జగ్గునాయక్‌, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, వరంగల్‌:

రుగల్లు వేదికగా మంగళవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు మహిళాలోకం కదిలి వచ్చింది. ఉమ్మడి జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచి మహిళలు నగరానికి తరలివచ్చారు. ఎక్కడ చూసినా వారే కనిపించారు. హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆడబిడ్డలపై వరాల జల్లు కురిపించారు. ‘రానున్న పదేళ్లలో మహిళలకు వడ్డీలేని రుణాలిస్తాం. సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తాం. ఒకప్పుడు టాటా, బిర్లాలుంటే.. ఇప్పుడు అంబానీ, అదానీలను మించిన పారిశ్రామికవేత్తలుగా మహిళలను మారుస్తాం’ అని స్పష్టం చేశారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా..

హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తొలుత కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానం (ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం) లో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘వరంగల్‌ గడ్డపై రైతు డిక్లరేషన్‌తో తెలంగాణలో కాంగ్రెస్‌ రూపురేఖలు మారిపోయాయి. ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే చారిత్రక వరంగల్‌ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. అభివృద్ధికి సుమారు రూ.ఆరువేల కోట్లు కేటాయించాం. వరంగల్‌ అభివృద్ధి చెందితే.. సగం తెలంగాణ అభివృద్ధి చెందినట్లే. నగరాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు’ అని సీఎం చెప్పిన మాటలకు మంచి స్పందన వచ్చింది. ‘ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి అక్కడ కాంగ్రెస్‌ జెండాను ఎగురవేసింది మన ఆడబిడ్డనే. ఆనాడు భద్రకాళి అమ్మవారు, సమ్మక్క–సారలమ్మ తల్లుల సాక్షిగా చెప్పా.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతామని ‘మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వేదిక మీదుగా మాట ఇస్తున్నా.. మిగిలిన అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత మాది’ అనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు తీన్మార్‌ మల్లన్న, సారయ్య, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, కమిషనర్‌ అశ్వినితానాజీ వాకడే పాల్గొన్నారు.

స్టెప్పులే స్టెప్పులు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్లతో పాటు పలు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో మహిళలు సభకు తరలివచ్చారు. దాదాపు లక్ష మందికిపైగా జనాలు రావడంతో కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ కనిపించింది. సీఎం రేవంత్‌రెడ్డి రాగానే.. ‘మూడు రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు మన రేవంతన్న’ అనే పాటకు మహిళలు స్టెప్పులు వేశారు. సభలో అర్జున అవార్డు గ్రహీతలు ఇషాసింగ్‌, నిఖత్‌ జరీన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మండలం ఎన్యుమరేషన్‌ ఎన్యుమరేటర్లు మొత్తం ఇళ్లు పూర్తయినవి శాతం

బ్లాకులు

ములుగు 179 148 20,930 20,427 97.60

వెంకటాపురం(ఎం) 95 81 11,077 11,077 100

గోవిందరావుపేట 101 77 10,114 10,007 98.94

ఎస్‌ఎస్‌ తాడ్వాయి 110 67 7,525 7,604 101.05

ఏటూరునాగారం 104 64 9,379 9,274 98.88

కన్నాయిగూడెం 41 32 4173 4127 98.90

మంగపేట 124 104 14,979 14,979 100

వెంకటాపురం(కె) 146 75 10,772 10,800 100.26

వాజేడు 105 65 8,603 8,650 100.56

మొత్తం 1,005 713 97,552 96,945 99.38

సీఎం పర్యటన సాగిందిలా...

మధ్యాహ్నం 2.39 గంటలకు: హైదరాబాద్‌ నుంచి హనుమకొండకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక.. ముందుగా నగరం మొత్తం ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు.

2.50 : కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ప్రజాకవి కాళోజీ కాంస్య విగ్రహావిష్కరణ

2.54: హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు సంబంధించిన రూ.4,601.15 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన

2.57 : కాళోజీ కళాక్షేత్రం భవన ప్రారంభోత్సవం

2.59 : కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ ఫొటో గ్యాలరీ సందర్శన

3.18 : ఆడిటోరియాన్ని సందర్శించి.. ప్రజాకవి కాళోజీపై రూపొందించిన బయోపిక్‌వీక్షణ

3.30 : కాళోజీ కళాక్షేత్రం నుంచి బస్సులో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానానికి పయనం

3.41 : ప్రజాపాలన విజయోత్సవ సభా ప్రాంగణానికి రాక, ఇందిరా మహిళాశక్తి స్టాల్స్‌ సందర్శన

సాయంత్రం 4.16: మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికపైకి రాక, ఆ తర్వాత ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళి

5.22: సీఎం ప్రసంగం మొదలు.. 34 నిమిషాలు కొనసాగిన స్పీచ్‌

5.58 : 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన

6.00 : సభాస్థలి నుంచి సీఎం హైదరాబాద్‌కు పయనం

న్యూస్‌రీల్‌

సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి దూరం

సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు కావడం.. మరోసారి కాంగ్రెస్‌పార్టీలో చర్చకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌ పాదయాత్ర సందర్భంగా మొదలైన వీరిమధ్య మనస్పర్థలు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇంకా సద్దుమణగలేదన్న విషయం ఈ అతిపెద్ద సభతో మరోసారి బహిర్గతమైనట్లయ్యింది. దొంతి మాధవరెడ్డి గతంలోనూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా సీనియారిటీ పరంగా సముచిత స్థానమిచ్చి గౌరవించకపోవడం వల్లనే సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే దొంతి దూరంగా ఉంటున్నారని ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

కుర్చీ దొరకక..

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణికి సీటు దొరక్కపోవడంతో ఇబ్బందిపడ్డారు. వేదికపైకి.. అక్కడున్న సిబ్బంది వెనకాల కుర్చీ తీసుకొచ్చి వేయడంతో ఆమె కూర్చున్నారు.

‘ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం’

నుంచి సీఎం వరాలు

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామన్న రేవంత్‌రెడ్డి,

డిప్యూటీ సీఎం భట్టి

వరంగల్‌ అభివృద్ధి జరిగితే

సగం తెలంగాణ అభివృది్ధ చెందినట్లే..

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగానికి

సభికులనుంచి అనూహ్య స్పందన

అంతకుముందు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం, పలు అభివృద్ధి

పథకాలకు శంకుస్థాపన

స్టాళ్ల పరిశీలన

హన్మకొండ చౌరస్తా: ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలోని సభా ప్రాంగణం ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పెంబర్తి హస్తకళలు, చెక్క ఎద్దుల బండ్లు, చేర్యాల నకాషీ, పెయింటింగ్స్‌, మాస్క్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, నారాయణపేట చీరలు తదితర స్టాళ్లను పరిశీలించారు. స్టాళ్ల నిర్వాహకులను వ్యాపారం ఎలా ఉంది.. ఏయే వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు.. టర్నోవర్‌ ఎంత? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలన్నీ ఇలాగే ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ దర్శనం.. గొప్ప అనుభూతి అని డైరీలో రాశారు. కాగా, పలు స్టాళ్ల నిర్వాహక మహిళలు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆయన చిత్రపటాన్ని అందజేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. వరంగల్‌లో నార్కొటిక్‌ పీఎస్‌..

ప్రారంభించిన సీఎం

– వివరాలు 8లోu

No comments yet. Be the first to comment!
Add a comment
ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం.. 1
1/7

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం.. 2
2/7

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం.. 3
3/7

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం.. 4
4/7

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం.. 5
5/7

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం.. 6
6/7

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం.. 7
7/7

ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement