బుగులోనికి భారీగా భక్తజనం
రేగొండ: మండలంలోని తిరుమలగిరి శివారులో జరుగుతున్న శ్రీ బుగులోని వేంకటేశ్వరస్వామి జాతరకు నాలుగో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం వేలాదిమంది వచ్చి మొక్కులు సమర్పించారు. భక్తులు భారీగా తరలిరావడంతో జాతర ఆవరణమంతా భక్తిభావంతో ఉప్పొంగింది. భక్తుల గోవింద నామస్మరణతో గుట్ట మార్మోగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గుట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి జాతరకు హాజరై మొక్కులు చెల్లించారు.
పోలీసుల సేవలు..
జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిట్యాల సీఐ మల్లేష్, ఎస్‌ఐ సందీప్‌కుమార్ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో అడుగడుగునా పోలీసుల సేవలు కనిపించాయి. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూశారు.
జాతర కమిటీ ఏర్పాట్లలో నిమగ్నం
జాతరలో మెదటి రోజు భక్తులు ఇబ్బందిపడడంతో జాతర కమిటీ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. జాతర ఈఓ బిల్లా శ్రీనివాస్, చైర్మన్ రొంటాల వెంకటస్వామి, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు.
కిటకిటలాడిన స్వామి సన్నిధి
జాతర ప్రాంగణంలో విడిది
Comments
Please login to add a commentAdd a comment