జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
ఏటూరునాగారం: జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు జిల్లానుంచి రామన్నగూడెం విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తెలిపారు. ఆదివారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హర్యానాలో నిర్వహించనున్న జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు జెడ్పీహెచ్‌ఎస్ రామన్నగూడెం పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులు రక్షిత, మైథిలి తయారుచేసిన ఇంటలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టం ఫర్ డ్రైవర్స్ అనే ఎగ్జిబిట్ జాతీయస్థాయికి ఎంపికై ందని చెప్పారు. విద్యార్థుల గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్యను డీఈఓ అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ జాతీయస్థాయికి ఎంపికవడం అభినందనీయమన్నారు. ప్రతిభకు గుర్తింపు లభించిందని గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు.
సభను విజయవంతం చేయాలి
గోవిందరావుపేట: ఈ నెల 19న హనుమకొండలో నిర్వహించే విజయోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి అన్నారు. మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాల నాగమణి ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కల్యాణి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారీ బహిరంగ సభకు మండలం నుంచి మహిళలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment