తొలి రోజు ప్రశాంతం
నిమిషం ఆలస్యం నిబంధనతో గేటుబయట నిలిచిపోయిన అభ్యర్థి లలిత
అభ్యర్థిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న కానిస్టేబుల్ యాకూబ్
ములుగు: జిల్లాలో ఆదివారం తొలిరోజు గ్రూప్–3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 2,173మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,182 మంది మాత్రమే హాజరయ్యారు. 991మంది గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యం నిబంధనతో 9 సెంటర్లలో 10 మంది వరకు పరీక్ష కేంద్రాలకు వచ్చి వెనుదిరిగారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల సెంటర్‌కు వెళ్లాల్సిన అభ్యర్థి భవాని జూనియర్ కళాశాలకు వెళ్లింది. హాల్‌టికెట్ తనిఖీ చేస్తున్న క్రమంలో అక్కడి సిబ్బంది పక్కనే ఉన్న సెంటర్‌కి వెళ్లాలని సూచించారు. అప్పటికే కేవలం రెండు నిమిషాల సమయం ఉండడంతో స్పందించిన కానిస్టేబుల్ యాకూబ్ తన ద్విచక్రం వాహనంపై సెంటర్‌కు సకాలంలో గేట్ లోపలికి పంపించారు. వెంకటాపురం(ఎం) మండలానికి చెందిన లలిత జాతీయ రహదారి పై బస్సు దిగి ప్రభుత్వం డిగ్రీ కళాశాలకు చేరుకునే లోపే గేటు మూసివేయడంతో వెనుదిరిగారు. నేడు (సోమవారం) గ్రూప్–3 మూడో పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జరుగనుంది.
అదనపు కలెక్టర్ పరిశీలన
ములుగు రూరల్: జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) సంపత్‌రావు అభ్యర్థుల హాల్‌టికెట్లను పరిశీలించారు.
గ్రూప్–3 పరీక్షకు 1,182మంది హజరు
Comments
Please login to add a commentAdd a comment