ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండలపరిధిలోని దానవాయి పేట గ్రామంలో ఆదివారం గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా ఊరు మా రాజ్యం’ అనే నినాదంలో ఆదివాసీలకు ప్రత్యేక స్వయం పాలన ఏర్పాటు చేయాలని అన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీసా చట్టాన్ని అమలు చేయకుండా రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న భూబాగాన్ని అంతా కలిపి ఆదివాసీలకు ప్రత్యేక స్వయం పాలన ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో చేలే పవన్, రాజు, అట్టం లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
ఐఎన్‌టీయూసీ ప్రధాన
కార్యదర్శిగా రాజేందర్
భూపాలపల్లి అర్బన్: ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పసునూటి రాజేందర్‌ను నియమించినట్లు జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ప్రకటించారు. ఏరియాకు చెందిన పసునూటి రాజేందర్ 32సంవత్సరాలుగా యూనియన్‌లో పని చేస్తున్నారు. కార్మిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నందున యూనియన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని యూనియన్‌లో కల్పించినందుకు జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, జనక్‌ప్రసాద్‌లకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించడంలో విఫలం
భూపాలపల్లి అర్బన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోత్కు ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యారంగానికి ఏడు శాత మే బడ్జెట్ కేటాయించి ఎన్నికల హమీని విస్మరించారని ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిస్తామని తెలిపారు. జిల్లాకేంద్రంలో యూనివర్సిటీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోనే అన్ని రకాల విద్యాసంస్థలను నెలకోల్పాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు జోసెఫ్, పవన్, లక్ష్మణ్, రక్షిత, శివ, రాజు, నవీన్ పాల్గొన్నారు.
రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ
రేగొండ: మండలంలోని భాగిర్థిపేట గ్రామంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాషీర్, తిరుపతి, భిక్షపతి, శ్రీనివాస్, సంతోష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
సభకు తరలిరావాలి..
ఈ నెల 19న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సభకు ముఖ్య మంత్రి రానున్నారని, ఈ సభను ఉమ్మడి రేగొండ మండలం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment