ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో ములుగు జిల్లా టాప్‌లో నిలిచింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నాటికి జిల్లాలోని తొమ్మిది మండలాల వ్యాప్తంగా 99.38 శాతం సర్వే పూర్తయ్యింది. ఈవిషయం తెలుసుకున్న మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు ఎన్యురేటర్లు, సూపర్‌వైజర్లను, యంత్రాంగాన్ని అభినందించారు. చిన్న జిల్లాను ఆదర్శంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 1,005 ఎన్యుమరేషన్ బ్లాకులు ఉండగా.. 97,552 ఇళ్లకు గానూ 96,945 ఇళ్లలో ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేశారు. మిగతా ఇళ్లకు తాళాలు వేసి ఉండడం, వలసవెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయని వారు ఉన్నట్లు అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు తెలిపారు. రేపటి నుంచి సేకరించిన వివరాలను ఆన్‌లైన్ చేయనున్నారు.
సర్వే వివరాలు..
మంగళవారం నాటికి
99.38 శాతం పూర్తి
అభినందించిన మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment