పలిమెల : మండలంలోని కామన్పల్లి –ముకునూరు రహదారిలోని కిష్టాపురం పహాడ్ వద్ద పెద్ద పులి సంచరిస్తుందని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తెలిపిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం నుంచి అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. బుధవారం తిరిగి గాలింపు చేపట్టినట్లు ఎఫ్ఆర్ఓ నాగరాజు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద పులి అనవాళ్లు, పాదముద్రలు గుర్తించలేదని తెలిపారు. నేడు (గురువారం) కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే అధికారులు ఎలాంటి నిర్ధారణ చేయకపోవడంతో పులి ఉందా.. లేదా అని స్థానికుల్లో సందిగ్ధం నెలకొంది.
నియామకం
కాళేశ్వరం: మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కొరిపల్లి ప్రశాంత్ జాతీయ మానవహక్కుల మండలి ఎన్జీఓ తెలంగాణ నార్త్‌జోన్ అధ్యక్షుడిగా బుధవారం ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మానవహక్కుల మండలి ఎన్జీఓ జాతీయ అధ్యక్షుడు అయిలినేని శ్రీనివాస్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment