బీజేపీ సంబురాలు
ములుగు రూరల్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఈ మేరకు శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పరిపాలనను ఆకాంక్షిస్తూ ప్రజలు బీజేపీ కూటమిని గెలిపిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రాచారి, కృష్ణాకర్, భూక్య జవహర్, రామరాజు, బుచ్చయ్య, మహేందర్, రాజ్‌కుమార్, రవిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment