భూపాలపల్లి అర్బన్: విద్యుత్‌శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఆన్ మ్యాన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం భూపాలపల్లి సర్కిల్ ఎస్‌ఈ మల్చూర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ నలవాల స్వామి మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికులను వేరే ప్రాంతాలకు డ్యూటీలకు పంపించొద్దన్నారు. ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని, ఇంక్రిమెంట్లు కలపాలని, స్కిల్డ్ వేతనాల ప్రకారం పెరిగిన వేతనం ప్రతి నెలా 10వ తేదీలోపు చెల్లించాలని కోరారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ ప్రతి నెల కలపాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోత్కూరి కోటి, భాస్కర్, ప్రసాద్, వెంకట్‌రాజు, కూన్రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment