బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకాలు
ములుగు/ములుగు రూరల్: సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో బాక్సింగ్ విభాగంలో ములుగు జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు కాంస్య పతకాలు సాధించినట్లు బాక్సింగ్ కోచ్ మామిడిపల్లి రమేశ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరి గిన పోటీల్లో 50 కేజీల విభాగంలో నవీన, 46 కేజీల విభాగంలో సోనియా ప్రతిభ కనబర్చినట్లు తెలి పారు. కాగా, విద్యార్థులను ప్రిన్సిపాల్ నర్మదబా యి, వ్యాయామ ఉపాధ్యాయులు త్రివేణి, శ్రీలత, ఉపాధ్యాయులు శుక్రవారం అభినందించారు.
ఏటూరునాగారం: హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో కరాటే విభాగంలో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటినట్లు కరాటే కోచ్ ఎండీ హుస్సేన్ తెలిపారు. చామర్తి ఐశ్వర్య సిల్వర్ మెడల్, బాదావత్ దినేశ్ –సిల్వర్, కందుకూరి శ్రీహరిణి –బ్రాంజ్, గూడూరి హర్షవర్ధన్ –బ్రాంజ్ మెడల్ సా ధించారని కోచ్ తెలిపారు. విద్యార్థులను జిల్లా యు వజన, క్రీడల అధికారి తులా రవి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment