కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆరుగ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మేడారంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యం కాని ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. పాలన చేతకాని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు . రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు. జిల్లాలో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునే విధంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య, మేడారం జాతర మాజీ చైర్మన్‌లు లింగయ్య, రేగ నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దిడ్డి మోహన్, పత్తి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు చిడం బాబురావు, గొంది శ్రీధర్, మోహన్‌రావు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బందెల తిరుపతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాగజ్యోతి
Comments
Please login to add a commentAdd a comment