నేడు కొండపర్తిలో కలెక్టర్ పర్యటన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని కొండపర్తిలో కలెక్టర్ దివాకర నేడు పర్యటించనున్నారు. గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న గ్రామంలోని ఇప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై మంగళవారం కలెక్టర్‌తో ప్రభుత్వ ప్రిన్సిపాల్ కిశోర్ సమీక్ష నిర్వహించిన విషయం విధితమే. ఈ గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై కలెక్టర్‌కు ఆదేశాల జారీ చేశారు. దీంతో పనుల పురోగతి, ఇంకా చేపటాల్సిన అభివృద్ధి పనులపై కలెక్టర్ నేడు కొండపర్తిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
గట్టమ్మ హుండీల లెక్కింపు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో గట్టమ్మ ఆలయ హుండీల లెక్కింపు ప్రక్రియను దేవాదాయశాఖ అధికారులు బుధవారం చేపట్టారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఈఓ బిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గట్టమ్మ హుండీల ద్వారా ఆదాయం రూ.1,93,838 వచ్చిందని తెలిపారు. ఇందులో రూ.1,81,555 నోట్ల రూపంలో లభించగా రూ.12,283 నాణాల రూపంలో వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకులు కవిత, పూజారులు కొత్త లక్ష్మయ్య, ఆర్‌ఐ యుగేంధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సీనియర్ పౌరుల పోషణ చట్టాన్ని అమలు చేస్తాం..
ములుగు: తలిదండ్రుల ఆలన, పాలన చూడడం లేదని ఫిర్యాదులు అందితే సీనియర్ పౌరుల పోషణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని ఆర్డీఓ వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ వారసులు తల్లిదండ్రులను పోషించని పక్షంలో స్థిరాస్తి కన్నవారికే అప్పగిస్తామని హెచ్చరించారు. గతనెల 2వ తేదీన ములుగు గ్రామానికి చెందిన ఇమ్మడి లక్ష్మీ–సమ్మయ్య దంపతులకు చెందిన 7.28ఎకరాల భూమిని కుమారుడు నాగరాజు స్వాధీనం చేసుకొని తమ పోషణను పట్టించుకోవడం లేదని ఫిర్యాధు చేశారని వెల్లడించారు. దీంతో వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 సెక్షన్ 5(1) ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరిపామని తెలిపారు. విచారణలో తల్లిదండ్రులను చూడడంలేదని తేలడంతో జీవనభృతిగా కుమారుడు నాగరాజు ప్రతినెలా రూ.6వేలు చెల్లిస్తామని అంగీకరించారని తెలిపారు. భవిష్యత్‌లో ఎవరైనా తల్లిదండ్రులను చూడకపోతే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఆర్డీఓ సూచించారు.
అర్హులందరికీ
రైతుభరోసా తప్పనిసరి
ములుగు రూరల్: కాస్తులో ఉన్న అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రైతుభరోసా తప్పనిసరిగా అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్య నా యకుల సమావేశం ఎండి.దావూద్ అధ్యక్షతన నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే భరోసా చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించిందన్నారు. జిల్లాలో అనేక మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలు చేస్తుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు చెల్లించాలన్నారు. రైతు కూలీల పట్ల ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికతో పథకాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, రవికుమార్, వెంకట్‌రెడ్డి, రాజేందర్, రఘుపతిరావు, గఫూర్‌పాషా, మల్లారెడ్డి, రాజేష్, చిరంజీవి, ఆదిరెడ్డి పాల్గొన్నారు.
పుష్కరాలు,
కుంభాభిషేకంపై సమీక్ష
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో నిర్వహించే కుంభాభిషేకం, సరస్వతినది పుష్కరాలపై దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ అధ్యక్షతన 10న శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మారుతి బుధవారం తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి క్షేత్రస్థాయిలో కాళేశ్వరం దేవస్థానాన్ని సందర్శించి సమీక్షలో పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరిలో జరుగు మహాశివరాత్రికి ముందే శృంగేరి పీఠాధిపతి, అతని శిష్య బృందంతో కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మే 15న జరిగే సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లపై చర్చించి ప్రణాళికలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment