డిజిటల్ అరెస్ట్‌కు గురికావొద్దు
ములుగు: సైబర్ నేరగాళ్ల భారిన పడి ప్రజలు డిజిటల్ అరెస్ట్‌లకు గురికావొద్దని సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ డీఎస్పీ సందీప్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో వైద్యులు, సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులకు సైబర్ నేరాలపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ముందుగా ఒకరు ఫోన్ చేసి మనిలాండరింగ్ అంటూ మొదలు పెడతారని, ఇలా ఒకరి నుంచి మరొకరు కాల్స్ మారుస్తూ మనకు తెలియకుండా మనం తప్పుచేశామా అనే భ్రమలోకి తీసుకెళ్లి డిజిటల్ అరెస్ట్ చేస్తారని తెలిపారు. ఎవరికై నా విషయం చెబితే మీ పరువుపోతుందని చెప్పి మనమే వారికి కొంత డబ్బు ఇచ్చేలా చేస్తారన్నారు. ఇండియా ఫోన్ నంబర్ 91 నుంచి మొదలవుతుందని తెలిపారు. అలా కాకుండా వేరే కోడ్‌లతో వస్తే ఫోన్‌కు సమాధానం ఇచ్చేందుకు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రం నుంచి రోజువారీగా రూ.7 నుంచి 8 కోట్ల వరకు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నాయని వెల్లడించారు. ఇందులో ఎక్కువగా రాచకొండ, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు భావిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1930కి లేదా సైబర్‌క్రైం లాగిన్‌కి కానీ ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌లాల్, సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ ఎస్కే యాసిన్, సిబ్బంది శ్రీకాంత్, తేజస్వీ తదితరులు పాల్గొన్నారు.
సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment