‘పీఎం కుసుమ్’ను సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరునాగారం: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకాన్ని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో పీఎం కుసుం పథకంపై పెసా మొబిలైజర్లకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లను పెట్టేందుకు పక్కా ప్రణాళికను కేంద్రం చేపడుతుందన్నారు. అందులో భాగంగానే 4ఎకరాల భూమి కలిగి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా లేదా రెవెన్యూ పట్టా కలిగి ఉండాలన్నారు. అలాగే విద్యుత్ సబ్ స్టేషన్‌కి ఐదు కిలోమీటర్ల దూరంలోని భూములను 25 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆ భూములకు ఏడాదికి ఎకరానికి రూ.12,500లు చెల్లించనున్నట్లు తెలిపారు. ఆ భూమిలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకంపై ఆసక్తి కలిగిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ లేదా రెవెన్యూ పట్టా కలిగిన రైతులు మరిన్ని వివరాల కోసం ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, ఏటీడీఓ క్షేత్రయ్య, తహసీల్దార్ జగదీశ్వర్, ఎస్‌ఓ సురేష్‌బాబు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ అనిల్, ఏఈ అశోక్ పాల్గొన్నారు.
ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం
Comments
Please login to add a commentAdd a comment