7న మెగా జాబ్‌మేళా
గోవిందరావుపేట: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 7వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఈజీఎంఎం అధికారులతో జాబ్ మేళా నిర్వహించే గార్డెన్‌ను అదనపు కలెక్టర్ సంపత్ రావు ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈజీఎంఎం ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ ద్వారా మండలంలోని చల్వాయి శివారులోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి సీతక్క ప్రారంభిస్తారని అన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన యువతీయువకులు మేళాలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఆయా కంపెనీలు శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 15,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. డీపీఎం సతీశ్, ఎంపీఓ శరత్ కుమార్, చల్వాయి కార్యదర్శి భారతి, ఏటీఎం నాగేశ్వరరావు, సీసీలు రజియా, సుభాషిని, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన
అదనపు కలెక్టర్ సంపత్‌రావు
50కంపెనీల ఆధ్వర్యంలో
15వేల ఉద్యోగాలు
Comments
Please login to add a commentAdd a comment