ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సందర్శన
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు వస్తే పంపించే ఆరోగ్య శ్రీ కలిగిన ఆస్పత్రులను సందర్శించినట్లు ఐటీడీఏ ఎస్‌ఓ సురేశ్‌బాబు, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ తెలిపారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు శుక్రవారం వరంగల్ జిల్లాలో ఆరోగ్య శ్రీ కలిగిన సంరక్ష, శ్రీనివాస కిడ్నీ సెంటర్, అజరా, గార్డియన్, ప్రతిమ, రోహిణి, ఎన్‌ఎస్‌ఆర్, రిలీఫ్, రెడ్ క్రాస్ తదితర హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుతున్నాయి.. పేషెంట్స్‌కు వసతులు ఉచితంగా అందుతున్నాయా.. అని తెలుసుకున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పేషెంట్స్‌కు, పేమెంట్ పేషెంట్స్‌కు తేడాను పరిశీలించామని అన్నారు. ఆర్థోపెడిక్, న్యూరాలజీ, యురాలజీ కార్డియాలజీ, పాల్మనాలాజీ, పాలిట్రామా తదితర కేసులను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రామ్ మేనేజర్ మహేందర్, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ పమ్మి విక్రమ్, టీం లీడర్ సుమన్, ఆరోగ్యమిత్ర కొండా రమేశ్ పాల్గొన్నారు.
ఉచిత సేవలపై ఆరా తీసిన
ఐటీడీఏ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment