క్రీడలు మానసిక దృఢత్వానికి దోహదపడతాయి
ములుగు రూరల్: పోలీసులకు వ్యాయామం, క్రీడలు మానసిక దృఢత్వానికి దోహదపడతాయని ఎస్పీ శబరీశ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని జాకారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో జిల్లా స్పోర్ట్స్ మీట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమని అన్నారు. క్రీడలు పోలీసుల్లో ఉత్తేజాన్ని నింపుతాయని, పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని అన్నారు. ప్రజల సంరక్షణ పోలీసుల ప్రథమ కర్తవ్యమని దీంతోపాటు పోలీసులు ఆరోగ్యం ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడలు నాలుగు రోజులపాటు నిర్వహిస్తామని ఈ నెల 06వ తేదీన ముగుస్తాయని వెల్లడించారు. జిల్లాలో మొత్తం ఆరు టీంలు.. క్రికెట్, వాలీబాల్, బ్యాట్మెంటన్, చెస్, క్యారమ్, రన్నింగ్ విభాగాల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎస్పీ, డీసీఆర్బీ కిషోర్ కుమార్, సీఎస్‌డీ డీఎస్పీ సందీప్‌రెడ్డి, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment