పంచాయతీ భూమిని కాపాడాలని వినతి
ములుగు రూరల్: మల్లంపల్లి పంచాయతీ భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలని గ్రామస్తులు సోమవారం అదనపు కలెక్టర్ మ హేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లంపల్లి గ్రామ పంచాయతీ స్థలం రెండు ఎకరాలు ఉండగా అందులో 16 గుంటల భూమి కబ్జాకు గురైందని తెలిపారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయింంచగా 16 గుంటల భూమి పంచాయతీకి సంబంధించిందని వరంగల్ కోర్టు సీని యర్ సివిల్ జడ్జి ఓఎస్ నంబర్ 227/2011లో నిర్ధారించి జడ్జిమెంట్ ఇచ్చారని వివరించారు. వెంటనే ఆ భూమిని పంచాయతీకి చెందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో వనమ శ్రీనివాస్, మొర్రి రాజుయాదవ్, అయిలయ్య, గొర్రె కుమారస్వామి, చీదర సంతోష్, ఎండి చోటే, పైడి, మహేందర్, రాజేందర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
12నుంచి వాలీబాల్
టోర్నమెంట్
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ చల్వాయి వాలీబాల్ యూత్ ఆద్వర్యంలో ఈ నెల 12, 13, 14 తేదీలలో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి వివిధ వాలీబాల్ టీంలు అదిక సంఖ్యలో పోటీలలో పాల్గొనాలని యూత్ కమిటీ సభ్యులు కోరారు. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన టీంలకు మొదటి బహుమతిగా రూ.15,016 ప్రైజ్‌మనీ, రెండో బహుమతిగా రూ.10వేలు, మూడో బహుమతిగా రూ.5,016, నాల్గో బహుమతి 3,016ప్రైజ్ మనీతో పాటు షీల్డులు కూడా ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. టీం ఎంట్రీలు ఈ నెల 10వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్ నంబర్ 9398062414, 7993772735లలో సంప్రదించాలని కోరారు.
చట్టాలపై అవగాహన
ములుగు: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నవభారతి మహిళా మండల సమాఖ్య భవనంలో న్యాయవిజ్ఞాన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ చట్టాలపై అవగాహన కల్పించారు. పేదరిక నిర్మూలన, మహిళా చట్టాలు, బాల్యవివాహ నిరోధక చట్టాలు, బాలకార్మిక చట్టాలు, ఉచిత న్యాయ సహాయంపై వివరించారు. ఉచిత సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాచర్ల రాజ్‌కుమార్, ఏపీఎం మహబూబ్‌పాషా, వీవోలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
హమాలీల కూలిపెంపు
జీఓ విడుదల చేయాలి
ములుగు రూరల్: సివిల్ సప్లయీస్, జీసీసీ హమాలీ కార్మికులకు పెంచిన కూలిపెంపు జీఓను విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట హమాలీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించిన అనంతరం అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరు రోజులుగా హమాలీ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టినా ఫలితం లేకపోవడంతో ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎగుమతి, దిగుమతి చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. గత డిసెంబర్ 31వ తేదీ లోపు పెంచిన హమాలీ చార్జీల పెంపు జీఓను విడుదల చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమ్జద్‌పాషా, ముత్యాల రాజు, కొమురయ్య, యూనియన్ అధ్యక్షుడు సుమన్, భిక్షపతి, రమేష్, రాంబాబు, రాజు, రఘుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment