మేకల మందలోకి కొండగొర్రె పిల్లలు
మంగపేట : అడవిలోకి మేతకోసం వెళ్లిన మేకల మందలో రెండు కొండగొర్రె పిల్లలు కలిశాయి. ఈ విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు కొండగొర్రె పిల్లలను స్వాధీనం చేసుకుని శనివారం హనుమకొండలోని జూపార్క్‌కు తరలించారు. మంగపేట అటవీ శాఖ ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి అశోక్ కథనం ప్రకారం.. మండలంలోని కోమటిపల్లికి చెందిన ఓ మేకల కాపరి తన మేకల మందతో శుక్రవారం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మేకల మందలో రెండు కొండగొర్రె పిల్లలు కలిసి వచ్చినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి కోటేశ్వర్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వెంటనే సంబంధిత బీటాఫీసర్ ప్రశాంత్‌కుమార్ బేస్ క్యాంపు సిబ్బందితో వెళ్లి పిల్లలను స్వాధీనం చేసుకుని మంగపేట రేంజ్ కార్యాలయానికి తరలించారు. కొండ గొర్రె పిల్లలు కావడంతో వాటి రక్షణ నిమిత్తం జూపార్క్‌కు తరలించినట్లు అశోక్ తెలిపారు.
జూపార్క్‌కు తరలించిన అటవీశాఖ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment