No Headline
వ్యవసాయంలో అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గతంలో కూలీలతో వివిధ రకాల పంటలపై పురుగుల మందును రైతులు పిచికారీ చేయించేవారు. దీంతో డబ్బులతో పాటు సమయం కూడా వృథా అయ్యేది. ఈ క్రమంలో ప్రస్తుతం వెంకటాపురం(ఎం) మండలంలోని పలు చోట్ల డ్రోన్‌తో పంటలపై పురుగుమందులను పిచికారీ చేపిస్తున్నారు. కేవలం 10నిమిషాల్లో ఎకరా పంటకు పురుగు మందు పిచికారీ, ఎరువుల పిచికారీ చేస్తుండడంతో సమయం ఆదాతో పాటు ఖర్చు కూడా తక్కువ అవుతుందని రైతులు చెబుతున్నారు. రైతుల నుంచి ఎకరా పంటకు రూ.400లు తీసుకుంటున్నట్లు డ్రోన్ నిర్వహకుడు నరెడ్ల వేణు చెబుతున్నాడు.
సేంద్రియ పద్ధతిలో..
వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన రైతు మిల్కూరి అయిలయ్య సేంద్రియ పద్ధతిలో మామిడితోట నిర్వహణ కొనసాగిస్తున్నాడు. 1.20 ఎకరాల్లో ఆరేళ్ల క్రితం 190 మామిడి మొక్కలను నాటగా గత సంవత్సరం నుంచి క్రాఫ్ వస్తుంది. ఎరువులు, పురుగుమందులు వాడకుండా కేవలం ఆవు పేడను మామిడి మొక్కలకు ఎరువుగా వేస్తూ సేంద్రియ పద్ధతిని అవలంభిస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది చెట్ల నుంచి 90 బాక్సుల మామిడిపండ్లు సేకరించి మార్కెట్‌కు తరలించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment