రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి●
● ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య
ములుగు రూరల్: గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న రెండో ఏఎన్‌ఎంల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బండి నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18సంవత్సరాలుగా ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 100శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలన్నారు. రెండో ఏఎన్‌ఎలం పోస్టులను అదనంగా పెంచాలని, తక్కువ పోస్టుల కారణంగా పరీక్షల్లో అర్హత సాధించని వారికి సైతం గ్రాస్ సాలరీ చెల్లించాలన్నారు. ఏఎన్‌ఎంలకు పీఆర్‌సీ, ఏరియల్స్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. రూ. 10లక్షల హెల్త్, జీవిత బీమాను వర్తింపజేయాలని కోరారు. అదే విధంగా రెండో ఏఎన్‌ఎంలకు బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, ఏఎన్‌ఎంల అసోసియేషన్ అధ్యక్షురాలు సరోజన, కోడి సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment