ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే.. | Sakshi
Sakshi News home page

ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..

Published Wed, May 8 2024 3:35 AM

-

ప్రఽదానంగా నారాయణపేట, కొడంగల్‌, వనపర్తి, దేవరకద్ర, మక్తల్‌, మహబూబ్‌నగర్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 20 వేల వరకు వలస ఓటర్లు ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేటతో పాటు ధన్వాడ, దామరగిద్ద, కోయిలకొండ ప్రాంతాల్లో వలస కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గండేడ్‌, మహమ్మదాబాద్‌, హన్వాడ మండలాలకు చెందిన తండాలవాసులు భారీగానే ఉన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్‌పేట మండలాల ప్రజలు అత్యధికంగా ఇతర రాష్ట్రాల్లో ముంబై, బెంగళూరు, పుణె వంటి చోట్ల స్థిరపడి ఉన్నారు. వీరందరి ఓట్లు, ఆధార్‌, రేషన్‌కార్డులు సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు ఏవైనా వలస ఓటర్లు తమదైన శైలిలో గెలుపోటముల్లో ప్రభావం చూపుతున్నారు. పంచాయతీ, స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికల్లో వీరిపైనే ప్రధానంగా ఫోకస్‌ పెట్టిన ప్రధాన పార్టీలు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Advertisement
Advertisement