నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 112 చెంచు గూడెల్లో 10,500 జనాభా ఉంది. చెంచులకు పక్కా ఇళ్లు కలగానే మిగిలాయి.70 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే జీవిస్తున్నారు. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకొన్న గుడిసెల్లోనే కాలం వెలదీస్తున్నారు. వర్షంలో తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ అవస్థలు పడుతున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్, లింగాల, బల్మూర్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, హన్వాడ, మండలాల్లోని గిరిజన గూడెల్లో కనీస వసతులకు నోచుకోక నరకయాతన అనుభవిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment