మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మనీల
కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమి టీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం జీఓ నం. 5404ను శుక్రవారం జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేయగా.. వెల్దండ మండలానికి చెందిన మనీలను చైర్‌పర్సన్‌గా.. పండిత్‌రావును వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. సభ్యులుగా నారాయణ, కొండల్, భీంలా, రమాకాంత్‌రెడ్డి, కృష్ణయ్య, రాజశేఖర్, ముస్తఫా, యాదయ్య, అంసుద్దీన్, రామకృష్ణారెడ్డి, దాచేపల్లి శ్రీనివాసులు, గోపిరెడ్డి రాంరెడ్డిలను నియమించారు. ఈ కమిటీలో చారకొండ పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, కల్వకుర్తి వ్యవసాయ మా ర్కెట్ అధికారి, మున్సిపల్ చైర్మన్ సభ్యులుగా ఉంటా రు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మార్కెట్ నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో ఎట్టకేలకు నియమించారు. మార్కె ట్ కమిటీ చైర్‌పర్సన్ మనీల భర్త వెల్దండ పీఎసీఎస్ చైర్మన్ సంజీవ్‌కుమార్ యాదవ్ శుక్రవారం ఎమ్మె ల్యే కసిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment