వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
నర్వ: అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని.. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అమలు తీరుతెన్నును పరిశీలించేందుకే పర్యటిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా నర్వ మండలంలో కేంద్రమంత్రి పర్యటించారు. ముందుగా మండలంలోని రాయికోడ్ మంత్రి చేరుకోగా.. ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పోలీస్ బలగాలచే గౌరవ వందనం స్వీకరించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అంగన్‌వాడీ కేంద్రం పరిశీలన..
కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందుగా మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం బాలామృతాన్ని చిన్నారులకు తినిపించి.. ప్రీప్రైమరీ విద్య ఎలా సాగుతుందని టీచర్లతో ఆరా తీశారు. అలాగే, గర్భిణులకు శిశుసంక్షేమ శాఖ పోషణ కార్యక్రమంలో భాగంగా సీమంతం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్‌ను పరిశీలించారు. ఆయుష్మాన్‌భారత్ కార్యక్రమంలో భాగంగా పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయగా.. వాటి ద్వారానే గ్రామీణులకు అన్ని రకాల వైద్యసదుపాయాలు అందుతున్నాయని డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి మంత్రికి వివరించారు. అత్యవసర వైద్య సేవల కోసం ఇటీవల 108 అంబులెన్స్‌ను ప్రారంభించామని, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాదులను గుర్తించి చికిత్స కోసం రెఫర్ చేస్తున్నామన్నారు.
రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదు..
రాజకీయాలపై మాట్లాడేందుకు ఇక్కడికి రాలేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరుపై పర్యవేక్షించి నివేదిక అందించేందుకు వచ్చానని మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లో 500 బ్లాక్‌లలో(మండలాలు)సంపూర్ణ అభియాన్ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఎంపికై న నారాయణపేట జిల్లాలోని నర్వ, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను కేంద్రానికి నివేదిస్తామన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ
మంత్రి బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment