పాలమూరులో మన్మోహన్‌సింగ్ జ్ఞాపకాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారి జూలై 1, 2004న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామంలో దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో సంభాషించారు. వారికి భరోసా కల్పించి ప్రభుత్వం తరఫున 13 మంది రైతు కుటుంబాలకు రూ.19.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. అదేవిధంగా ధర్మాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.45 లక్షలు ప్రకటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
● రెండోసారి మన్మోహన్‌సింగ్ అక్టోబర్ 26, 2006న ప్రస్తుతం వనపర్తి జిల్లా కొత్తకోటలో పర్యటించారు. నాగ్‌పూర్ మీదుగా హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు ఏడో నంబర్‌జాతీయ రహదారి (ప్రస్తుతం 44) నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రధాని హోదాలో రెండుసార్లు పర్యటన
Comments
Please login to add a commentAdd a comment