‘పాలమూరు’ ఎత్తిపోతలపై కుట్రలు | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ ఎత్తిపోతలపై కుట్రలు

Published Tue, Dec 31 2024 1:18 AM | Last Updated on Tue, Dec 31 2024 1:18 AM

‘పాలమూరు’ ఎత్తిపోతలపై కుట్రలు

‘పాలమూరు’ ఎత్తిపోతలపై కుట్రలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ నుంచి డిండి ప్రాజెక్ట్‌ ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీరందించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీఓ 159ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ఇప్పటికే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌ ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా పాలమూరు ప్రాజెక్ట్‌లోని ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలిస్తే పాలమూరు జిల్లాలోని కర్వెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లకు నీరు అందని పరిస్థితి తలెత్తనుందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి త్వరగా ఇక్కడి రిజర్వాయర్లను నీటితో నింపాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి నుంచి నీటిని తరలిస్తే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. పాలమూరు ప్రజల సాగునీటి ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి త్యాగాలకై నా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జీఓ 159ను రద్దు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. అలాగే రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో పోరాటం చేసిన బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ విగ్రహాన్ని సైతం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

కాంగ్రెస్‌నేతలు స్వార్థ రాజకీయాలు ఆపండి

జీఓ 159 రద్దు చేయాలి: మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement